గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Sep 11, 2020 , 00:19:49

మన్‌మర్రిలో యువతి అదృశ్యం

మన్‌మర్రిలో యువతి అదృశ్యం

షాబాద్‌ : షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని మన్‌మర్రి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. షాబాద్‌ సీఐ అశోక్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కకరాజుల అఖిల (19) గత నెల 22న రాత్రి భోజనం చేసి ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి పడుకుంది. మరుసటిరోజు తెల్లవారుజామున కుటుంబసభ్యులు లేచి చూ డగా అఖిల కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం యువతి తండ్రి షాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నెంబర్‌ 9440627257కు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.