మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 11, 2020 , 00:19:51

స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ

స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతిని ధులు ఆమె స్ఫూర్తిని కొనియాడారు. షాద్‌ నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఇబ్రహీం పట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఐలమ్మ పోరాట పటిమను యువత స్ఫూర్తిగా తీసుకోవా లని సూచించారు. పలుగ్రామాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.     

షాబాద్‌ : చాకలి ఐలమ్మ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రజకసంఘం జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య అన్నా రు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా  గురువారం షాబాద్‌ మండల కేంద్రంలో వైస్‌ ఎంపీపీ జడల లక్ష్మి, సర్పంచ్‌ సుబ్రమణ్యేశ్వరి, ఎంపీటీసీ అశోక్‌తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కల్వకోల్‌ వెంకట్‌యాదవ్‌, గ్రామ రజక సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌, కమిటీ సభ్యులు శ్రీశైలం, లక్ష్మణ్‌, శివ, రమేశ్‌, సాజీత్‌ ఉన్నారు.

శంకర్‌పల్లి : అప్పటి నిరంకుశ నిజాం సర్కారుతో తెలంగాణ రైతుల కొరకు పోరాటం జరిపిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని శంకర్‌పల్లి మండల రజక సంఘం అధ్యక్షుడు చాకలి మల్లేశ్‌ అన్నారు. గురువారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లిలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని జనవాడ గ్రామంలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గౌడిచర్ల నర్సింహ, కోశాధికారి వెంకటేశ్‌, నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బద్ధం శశిధర్‌రెడ్డి, రజక సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి అనంతయ్య, నాయకులు విఠల్‌, రాంచందర్‌, అమృతమ్మ, రాజేశ్వర్‌గౌడ్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీను పాల్గొన్నారు.

కొందుర్గుః విశ్వనాథ్‌పూర్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, రామకృష్ణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, గోపాల్‌, శ్రీశైలం, ప్రకాశ్‌, యాదయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కేశంపేటః కొత్తపేటలో సర్పంచ్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ జగదీశ్వర్‌, వార్డు సభ్యులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌ : చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి వినోద్‌కుమార్‌, చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు చాకలి మల్లేశ్‌, నాయకుడు అరవింద్‌ ఆధ్వర్వంలో గురువారం మండల కేంద్రంలో వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పాటి జగన్‌మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, మాణిక్‌రెడ్డి, బాల్‌రాజ్‌, రావూఫ్‌, కేబుల్‌ రాజు, నర్సింహాగౌడ్‌, డప్పు రాజు, బేగిరి రాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, అరవింద్‌, ప్రధాన కార్యదర్శి విక్రం ఉన్నారు.