గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Sep 10, 2020 , 01:02:29

ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు నూతన కేంద్రం ఏర్పాటు

 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు నూతన కేంద్రం ఏర్పాటు

అబ్దుల్లాపూర్‌మెట్‌ : కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షా కేంద్రాన్ని జనావాసాలకు దూరంగా ఉండేలా సర్పంచ్‌ చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్‌, వార్డు సభ్యులు బుధవారం చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రం ఇండ్ల మధ్యలో ఉన్నందున ప్రజల ఇబ్బందులను తెలుసుకొని మరో చోట ఏర్పాటు చేశారు. తహసిల్దార్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న డ్వాక్రా భవనాన్ని పరిశీలించి ఇక్కడే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. చుట్టుపక్కల నివాసముంటున్నవారు భయాందోళనకు గురై పలుమార్లు తమ దృష్టికి తీసుకువచ్చారని సర్పంచ్‌ తెలిపారు. డ్వాక్రా భవనంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మార్చామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మొగుళ్ల జీవన్‌రెడ్డి, తాలిపల్లి రమేశ్‌గౌడ్‌, మందుగుల శ్రీకాంత్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, పీహెచ్‌సీ వెంకట్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు ఉన్నారు