గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 10, 2020 , 00:26:36

కాళోజీకి ఘన నివాళి

కాళోజీకి ఘన నివాళి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ :  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయనను స్మరించుకుని,  నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో  కాళోజీ చిత్రపటానికి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌జైన్‌ పూలమాలలు వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు, జిల్లా అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.