ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Sep 03, 2020 , 04:13:42

డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి

డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి

  • రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..
  • ప్రతి గ్రామంలో ఔషధ మొక్కలు పెంచేందుకు కృషి 
  • ఈ వానకాలం రాష్ట్రంలోకోటి 40లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 
  • ప్రగతి రిసార్ట్స్‌లో మునగ సాగు పరిశీలన.. 
 శంకర్‌పల్లి రూరల్‌: పోషక విలువలు ఉండే పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు ఎంతో లాభం కలుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. బుధవారం శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో మూడు వందల ఎకరాల్లో సాగు చేసిన మునగసాగు పంటను ఆయన వ్యవసాయశా ఖ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రిసార్ట్స్‌లో సాగు చేసిన వివిధ ఔషధ మొక్కలు వాటి ఉపయోగాల గురించి రిసార్ట్స్‌ సీఎండీ జీబీకేరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ కల్గిన పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.కరివేపాకు, పుదీన, మునగ తదితర పం టల సాగుతో యువ రైతులు వ్యవసాయం చేయడం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని వారికి అవగాహన కల్పిస్తామన్నారు. మునగ ఆకులకు దేశియ మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉందని, రాష్ట్రంలో సాగు చేస్తే ఎలా ఉం టుందో అధ్యయనం చేయడానికి ఇక్కడకు వచ్చినట్టు  మం త్రి తెలిపారు. మునగ ఆకుల పొడి ఔషధంగా ఎంతో
ఉపయోగంగా ఉంటుందన్నారు. దేశంలో మునగసాగుతో రూ. 40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయ డం ద్వారా ఎకరానికి లక్షరూపాయల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రంలో  మునగ సాగు విస్తీర్ణం పెంచేందుకు కావల్సిన పరి స్థితులపై అధ్యయం చేసి, వచ్చే వర్షాకాలం నుంచి సాగు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి ని రంజన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వానకాలంలో కోటి, 40లక్షల ఎకరాలల్లో రైతులు అన్ని రకాల పంటలను సాగు చేశారని, గతంలో కంటే ఈ ఏడాది 39శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. మక్కజొన్నలు ఎగుమతి లేక గోదాములల్లో నిల్వలు పేరుకు పోవడంతో మక్క జొన్నకు బదులుగా పత్తి, కంది, వరి సాగు చేయాలని ప్రభుత్వం సూచించడం తో రైతులు సానుకూలంగా స్పందించి పంటలు వేశారన్నా రు. పత్తి రాష్ట్రంలో 59 లక్షల ఎకరాలల్లో సాగు చేశారని, పత్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కం దులకు మాత్రం ప్రైవేట్‌ మార్కెట్‌లో గిట్టు బాటు ధర రాని పక్షంలో ప్రభుత్వం కొనుగోలు చేసే విషయం ఆలోచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్‌రాంరెడ్డి, జేడీఏ సరోజినిదేవి, సునందారెడ్డి, సంగారెడ్డి జేడీ సునిత, జిల్లా వ్యవసాయశాఖ  అధికారి గీతారెడ్డి, మొయినాబాద్‌ ఏవో రాగమ్మ తదితరులు పాల్గొన్నారు.