మంగళవారం 20 అక్టోబర్ 2020
Rangareddy - Sep 03, 2020 , 01:32:28

నందన వలయం..

 నందన వలయం..

 • ఔటర్‌ రింగురోడ్డు పొడవునా కనువిందు చేస్తున్న హరిత శోభ
 • 158 కిలో మీటర్ల మేర12,12,752     పూల మొక్కలు
 • కిలో మీటరుకు సగటున     7675 మొక్కలు
 • రుతువులు, కాలానికి అనుగుణంగా ఎంపిక
 • నవంబర్‌లో కొత్త  ఇండ్లు...!
 • 1.94లక్షల మంది  దరఖాస్తు..
 • త్వరలోనే అర్హుల ఎంపిక... 
 • 6,770 మంజూరు... రూ.335 కోట్లు మంజూరు 
 • జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు  దరఖాస్తు చేసుకున్న వారు కలెక్టరేట్‌లో సంప్రదించాలి 
 • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

నిరుపేదల సొంతింటి కల త్వరలోనే సాకారం కానున్నది. నియోజకవర్గాలవారీగా నిర్మిస్తున్న డబుల్‌ బ్రెడూం ఇండ్ల నిర్మాణం నవంబర్‌ వరకు పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాకు 6,770 ఇండ్లు మంజూరుకాగా వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.335 కోట్లు మంజూరు చేసింది.  వివిధ దశల్లో ఉన్న ఈ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో తొందరగా నిర్మాణాలు పూర్తి చేసి, శాస్త్రీయ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయింపులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు గతంలో కేటాయించగా మిగిలిన వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లను కేటాయించే ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ఈనెల 8 వరకు లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను కలెక్టరేట్‌లో అందజేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

-రంగారెడ్డి, నమస్తే తెలంగాణ  

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలో 6,645 రెండు పడక గదుల ఇండ్లు మంజూరు చేయగా, వీటికి ప్రభుత్వం రూ.335 కోట్లను మంజూరు చేసింది. అదనంగా 132 రెండు పడక గదుల ఇండ్ల్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాగా, 6,770 ఇండ్లలో 3,300 ఇండ్ల స్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. 

   శాస్త్రీయ పద్ధతిలో అర్హుల ఎంపిక..

 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జిల్లాలో జోరు పెరుగనుంది. శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ జిల్లాలకు ఇప్పటికే 6,770 , జీహెచ్‌ఎంసీ పరిధిలో 1లక్ష ఇండ్లు మంజూరయ్యాయి. మొత్తం 1.94లక్షల మంది రెండు పడక గదుల ఇండ్లు కావాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ వద్ద గణాంకాలున్నాయి. ఇందులో అర్హుల ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ జిల్లాకు సంబంధించి దాదాపు 50వేల మంది ఉండగా మిగతా వారంతా నగర శివారు ప్రాంతాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.  

జిల్లాలో జరిగిన పనులు..

      జిల్లాలో 167 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం  పూర్తయింది. ఇబ్రహీంపట్నంలో 85, రాజేంద్రనగర్‌లో 82 సిద్ధంగా ఉన్నాయి.  చేవెళ్లలో 100, ఇబ్రహీంపట్నంలో 235, మహేశ్వరంలో 232, రాజేంద్రనగర్‌లో 140, షాద్‌నగర్‌లో 1760 చొప్పున మొత్తం 2367 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన 1705 ఇండ్లను పంచాయతీరాజ్‌, అలాగే ఇబ్రహీంపట్నం, మహే శ్వరం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఆర్‌అండ్‌ బీ శాఖకు కేటాయించారు. వీటిలో పీఆర్‌వీ 100, ఆర్‌అండ్‌బీ 1760 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. చేవెళ్ల నియోజకవర్గానికి 1,060 రెండు పడక గదుల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో జనవాడ, మీర్జగూడ, అజీజ్‌నగర్‌, సురంగల్‌ తదితర గ్రామాల్లో 80 ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 1,200 మంజూరు కాగా ఇందులో లింగంపల్లి క్రాస్‌ రోడ్డు, తక్కళ్లపల్లి, బండరావిర్యాల గ్రామాల్లో 230 ఇండ్ల్లకు టెండర్లు ఖరారు చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరు చేయగా ఇందులో జిల్లెలగూడ, బేగంపేటలలో 232 ఇండ్ల పనులు ప్రారంభించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి 240 ఇండ్లు మంజూరు చేయగా బైరాగిగూడ, కిస్మత్‌పూర్‌, ఆహ్మదుల్లానగర్‌ ప్రాంతాల్లో నిర్మాణం ప్రారంభించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గానికి 3,100 ఇండ్లు  మంజూరు చేయగా వీటిలో 3వేలకు పైగా ఇండ్ల పనులు షురూ చేశారు. జీ ప్లస్‌-1,జీప్లస్‌ -2, జీ ప్లస్‌ -3 పద్ధతుల్లో వీటిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు గృహ నిర్మాణం, రోడ్డు భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతా చోట్ల కూడా పనుల్లో వేగం పెంచేలా ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.  

వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు ఇలా..

  జిల్లాలో 2005-2008 మధ్యకాలంలో 18వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 17, 300  మంది లబ్ధిదారులు డబ్బులు చెల్లించగా ఇండ్లను కేటాయించారు.  మిగిలిన 700 ఇళ్లను దరఖాస్తులు చేసుకున్న వారు ఈనెల 8లోపు  కలెక్టరేట్‌లోని గృహనిర్మాణ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. తుర్కయాంజాల్‌లో 350,అబ్ద్దుల్లాపూర్‌మెట్‌లో 350 ఇండ్లకు దరఖాస్తులు చేసుకుని పెండింగ్‌లో ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే వీటితో పాటు అమీన్‌పూర్‌లో మరో 2వేల ఇండ్ల్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీనిపై ప్రతి సోమవారం మున్సిపల్‌ సెక్రటరీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇండ్ల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో 29 ప్రాంతాల్లో వీటిని నిర్మించారు.

లక్ష ఇండ్ల్లు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యం..

 జిల్లా పరిధితో పాటు జీహెచ్‌ఎంసీలో లక్ష ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని నగర శివారు ప్రాంతాల్లో ‘ఇన్‌సిటూ’ పద్ధతిలో స్లమ్‌ ఏరియాలలో నిర్మించిన వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో మూడు ప్రాంతాల్లో మోడల్‌ కాలనీలు నిర్మించారు. వాటిలో ఎల్బీనగర్‌ ఎరుకల నాంచారమ్మ బస్తీ, జైభవానీ నగర్‌, కర్మన్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం అన్ని రకాల ఇండ్లను అక్టోబర్‌ నెలాఖరు వరకు పూర్తి చేసి నవంబర్‌లో లబ్ధిదారులకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నది. 

జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలకు 4వేలు కేటాయింపు..

  జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 12వేల ఇండ్లను కేటాయించనున్నారు. ఇందులో ఒక ఎమ్మెల్యే పరిధిలో 4వేల ఇండ్ల చొప్పున రానున్నాయి. అలాగే నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మహేశ్వరంలోని రెండు వేల ఇండ్లల్లో 10శాతం స్థానికులకు ఇవ్వనున్నారు. శంకర్‌పల్లి 1500 ఇండ్లలో, మంఖాల్‌లో నిర్మిస్తున్న 3వేల ఇండ్లలోనూ స్థానిక కోటా కింద 10 శాతం కేటాయించనున్నారు.

8వ తేదీ వరకు పూర్తి వివరాలు ఇవ్వాలి

ప్రకాశ్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌

    రంగారెడ్డి జిల్లాలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం,వాంబే పథకం కింద 2005-2008 మధ్యకాలంలో ఇండ్ల కేటాయింపులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 8వ తేదీ వరకు పూర్తి వివరాలు ఇవ్వాలి. 2005 నుంచి 2008 సంవత్సరాల మధ్య రూ.6వేలు,రూ.2వేలు చెల్లించి ఐరిస్‌ కార్డు పొంది ఉన్నవారు తమ హౌసింగ్‌ ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్లను సమర్పించాలి.  logo