సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 00:09:34

చేవెళ్లలో 8 మందికి కరోనా పాజిటివ్‌

చేవెళ్లలో 8 మందికి కరోనా పాజిటివ్‌

చేవెళ్ల: కరోనావ్యాధి పట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ దవాఖాన సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ప్రదీప్‌ తెలిపారు. శనివారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో 50మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. అదేవిధంగా ఆలూర్‌ పీహెచ్‌సీలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి నెగిటివ్‌గా తేలిందని వైద్యులు తెలిపారు. కరోనా సోకినవారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నిషన్‌ దేవేందర్‌, శ్రీధర్‌, సాయికుమార్‌ ఉన్నారు.

కరోనా  కట్టడికి ప్రజలు సహకరించాలి 

శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ప్రజలు కరోనా కట్టడికి సహకరించాలని శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రోజుకు 10మంది చొప్పున వైరస్‌ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అందుకోసం పాజిటివ్‌ వచ్చిన రోగులు డాక్టర్‌ సలహాలు పాటిస్తూ హోంక్వారంటైన్‌ లేదా దవాఖానలో ఉండాలని సూచించారు. కాగా కొందురు కరోనా బారిన పడినా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా రోడ్లపై మామూలు వ్యక్తుల్లా తిరుగుతూ సామాజిక నేరానికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని డాక్టర్లు, అధికారులు గుర్తించి వారు ఇండ్లలో లేదా దవాఖానలో ఉండేలా చూడాలన్నారు.  వ్యాపారస్తులు కూడా దుకాణాల్లో గుంపులుగా కూర్చోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.