శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 00:12:38

పశువులకు అంతుచిక్కని వైరస్‌

పశువులకు అంతుచిక్కని వైరస్‌

పూడూరు :మండల పరిధిలోని పలు గ్రామాల్లోని రైతుల ఎడ్లకు అంతుచిక్కని వైరస్‌ సోకుతుందని పలువురు రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టంపల్లి గ్రామంలోని కారురి రవి,మల్గ బుచ్చయ్యలతో పాటు ఇతర రైతుల ఎడ్లకు దద్దులు ఏర్పడి పుండ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌ కావడంతో రైతులు ఎడ్లతో వ్యవసాయ పనులు చేసే సమయంలో అంతు చిక్కని వ్యాధి సోకడంతో చాలా ఇబ్బందిగా మారిందని రైతులు పేర్కొంటున్నారు.

అంగడి చిట్టంపల్లి గ్రామంలోనే సుమారుగా 15 మంది రైతుల ఎడ్లకు ఈ వ్యాధి సోకింది. దీంతో స్థానికంగా ఉన్న కంపౌండర్‌తో పశువులకు టీకాలు వేయిస్తే రోజుకు మందులతో కలిపి రూ.300ల వరకు ఖర్చు వస్తుందని, అలాగే 5 రోజుల పాటు టీకాలు వేయిస్తున్నా తగ్గడంలేదని రైతులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ మాదిరిగానే పశువులకు కూడా ఒక ఎద్దు నుంచి మరో ఎద్దుకు వ్యాధి సోకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది రైతులు ఇతర ఎడ్ల వద్దకు పొకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా మండల పశువైద్యాధికారులు గ్రామంలో ప్రత్యేక క్యాంప్‌ నిర్వహించి మందులు అందజేయాలని రైతులు కోరుతున్నారు.