గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 25, 2020 , 00:40:24

రైతు బీమా వివరాలు ఇవ్వండి : ఏవో

రైతు బీమా వివరాలు ఇవ్వండి : ఏవో

మాడ్గుల: నూతనంగా పాసుబుక్కులు వచ్చిన రైతులు వచ్చే నెల సెప్టెంబర్‌ మొదటి వారంలో రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి గౌతం కోరారు. సోమవారం అప్పారెడ్డిపల్లి గ్రామంలో రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షులు, డాక్టర్‌ రాంరెడ్డికి గ్రామంలో రైతుబీమాకు అర్హులైన రైతుల వివరాలను ఏవో అందజేశారు. రైతుబీమాకు కొత్తపాసు బుక్కు, ఆధార్‌కార్డు, నామిని ఆధార్‌ కార్డు జిరాక్స్‌ లను జతచేసి దరఖాస్తు  ఇవ్వాలని ఏవో తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నవ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు యాదయ్య  పాల్గొన్నారు.