ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 21, 2020 , 00:56:45

ఏసీబీ వలలో సూపరింటెండెంట్‌...

ఏసీబీ వలలో  సూపరింటెండెంట్‌...

  • రంగారెడ్డి కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడినఅసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌  కార్యాలయం అధికారి

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: రంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం రెండో అంతస్తులోఉన్న అసి స్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ (ఏవో) బొమ్మరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. శంషాబాద్‌ మండలం తొండుపల్లి గ్రామంలోని 108 సర్వే నంబర్‌లో 20 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి సంబంధించి ఖాజాగూడకు చెందిన టీ.వెంకటేశ్వర్‌రెడ్డి రీ-సర్వేకు దరఖాస్తు పెట్టుకున్నాడు.  ఈ వివరాలకు సంబంధించి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయం నుంచి వివరాలను రాజేంద్ర నగర్‌ ఆర్డీవో కార్యాల యానికి బదిలీ చేసేందుకు సదరు అధికారి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధి కారులను ఆశ్రయించాడు. దీంతో మాటు వేసి రూ. ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.కలెక్టరేట్‌లోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయం ఏసీబీ అధికా రులు సోదాలు నిర్వహించి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మరెడ్డి వెంక టేశ్వర్‌ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. గడిచిన మూడు నెలల్లో రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి . గతంలో ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు విషయంలో ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్‌ లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. మళ్లీ తాజాగా గురువారం కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు చేయడంతో ఉలిక్కిపడ్డారు. వరుసగా రెండోసారి దాడులు చేయడంతో అధికారులు కొంత ఆందోళన చెందారు.

డబ్బులు డిమాండ్‌ చేస్తే 1064 కు కాల్‌ చేయండి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. బాధితులు నేరుగా వచ్చినా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.