బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 01:09:20

చిరు వ్యాపారులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆత్మ‌నిర్భ‌ర్ భ‌రోసా!

చిరు వ్యాపారులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆత్మ‌నిర్భ‌ర్ భ‌రోసా!

  • l కరోనా నేపథ్యంలో రుణాలు పంపిణీ
  • l టార్గెట్‌ రూ.491 కోట్లు.. అందజేసింది రూ.320 కోట్లు
  • l 65.25 శాతం రుణాల  అందజేత 
  • l 16,706 పరిశ్రమలకు  ప్రయోజనం
  • l ఎంఎస్‌ఎంఈలో బ్యాంకు ఖాతాలు 13,090, బిజినెస్‌ అకౌంట్లు 3,616 
  • l వంద శాతం రుణాలను    అందించేందుకు చర్యలు 
  • l కలెక్టర్‌ అమయ్‌కుమార్‌  ప్రత్యేక దృష్టి 

కేంద్ర ప్రభుత్వ క్రెడిట్‌ గ్యారంటీ పథకం(ఆత్మ నిర్భర్‌ అభియాన్‌) ద్వారా చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా భరోసా కల్పించడంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా ఒక్కో వీధి వ్యాపారికి రూ.10 వేల చొప్పున రుణం అందజేస్తున్నది. జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు, 27 మండలాల్లో మెప్మా అధికారులు ప్రత్యేక సర్వే చేశారు. జిల్లాలో 3400 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి మొత్తం 16,706  అకౌంట్లు ఉన్నాయి. ఇందులో ఎంఎస్‌ఎంఈలో 13,090 బ్యాంకు అకౌంట్లు ఉండగా, వాటిలో 7,680 అకౌంట్లకు రుణాలు మంజూరు చేశారు. అలాగే 3616 బిజినెస్‌ అకౌంట్లు ఉండగా, 1328 అకౌంట్లకు రుణాలు మంజూరైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఆత్మ నిర్భర్‌ పథకంలో జిల్లావ్యాప్తంగా రూ.491 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు  రూ.320 కోట్ల  రుణాలు అంటే 65.25 శాతం పంపిణీ చేశారు.రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మనిర్భర్‌ పథకం చేయూతనందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా రూ.10 వేల చొప్పున రుణాలు చిరు వ్యాపారులు పొందుతున్నారు. నగదు రహిత లావాదేవీల దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వీధి వ్యాపారులకు రుణాలతో పాటు పేటీఎం, గూగుల్‌పే క్యూఆర్‌ కోడ్‌ నంబర్లను బ్యాంకు సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ మెప్మా సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఒక్కో వీధి వ్యాపారికి రూ.10 వేల చొప్పున రుణం అందిస్త్తున్నది. జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు, 27 మండలాల్లో మెప్మా అధికారులు ప్రత్యేక సర్వే చేశారు. ఆత్మనిర్భర్‌ పథకంతో రుణ లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతున్నది. చిరు వ్యాపారులకు మరింత చేయూత అందించేందుకు కలెక్టర్‌ ఇప్పటికే రెండు దఫాలుగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ క్రెడిట్‌ గ్యారంటీ పథకం (ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ ) ద్వారా వంద శాతం రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రుణాలు మంజూరుపై కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో ఇటీవల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

16,706 పరిశ్రమలకు ప్రయోజనం..

జిల్లాలో 3400 చిన్న,   మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి మొత్తం 16,706  అకౌంట్లు ఉన్నాయి. ఇందులో ఎంఎస్‌ఎంఈలో 13,090 బ్యాంకు అకౌంట్లు ఉండగా, వాటిలో 7,680 అకౌంట్లకు రుణాలు మంజూరుచేశారు. బిజినెస్‌ అకౌంట్లు 3616 ఉంటే 1328 అకౌంట్లకు రుణాలు మంజూరైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా రూ.491 కోట్లు ఆత్మ నిర్భర్‌ పథకంలో రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.320 కోట్ల రుణాలు అంటే 65.25 శాతం పంపిణీ చేశారు. అక్టోబర్‌ 31 వరకు గడువు ఉన్నప్పటికీ జిల్లాలో ఈనెలఖారులోపు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి రుణ హామీ పత్రాలు, షరతులు లేకుండా ఆత్మ నిర్భర్‌ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీసుకున్న రుణాలు వచ్చే నాలుగేండ్లలోపు చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. అయితే రుణం తీసుకున్న మొదటి ఏడాది మారిటోరియం వర్తిస్తుంది. తర్వాత మూడేండ్లలో రుణాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. 

 వంద శాతం నమోదు చేసుకునేలా చర్యలు 

ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ కింద చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు, వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో కలెక్టర్‌, ఎల్‌డీఎంలు, జిల్లా పరిశ్రమల అధికారులు సమన్వయంతో పనిచేసి వంద శాతం రుణాలు అందజేసేలా చర్యలు చేపట్టారు. వీధి వ్యాపారులకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా వంద శాతం నమోదు చేసుకునేలా, ప్రతి వీధికి ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. కేంద్ర ప్రభుత్వం క్రెడిట్‌ గ్యారెంటీ పథకం కింద వంద శాతం ఋణాలు అందించే తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చిరు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యాజమానులు రుణాలు వద్దనుకుంటే బ్యాంకులకు లేఖలు ఇవ్వొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. 

ఆత్మ నిర్భర్‌ రుణాలు 65.25 శాతం 

జిల్లాలో 3400 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 16,706 అకౌంట్లకు ప్రయోజనం కలుగనున్నది. . ఆత్మ నిర్బర్‌ పథకంలో జిల్లా వ్యాప్తంగా రూ.491 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.320 కోట్లు అందజేశారు. 65.25 శాతం రుణాల పంపిణీ సాధించాం. అక్టోబర్‌ 31 వరకు గడువు ఉన్నప్పటికీ  ఈనెలఖారు లోపు టార్గెట్‌ను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. 

-రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి