శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:05:42

సర్వాయి పాపన్న సేవలు మరువలేనివి

సర్వాయి పాపన్న సేవలు మరువలేనివి

యాదాద్రి, నమస్తేతెలంగాణ : సర్దార్‌ పాపన్న జీవితం ఆదర్శనీయమని యాదగిరిగుట్ట గౌడసంఘం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం పాపన్న జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గౌడసంఘం కార్యాలయం ముందున్న పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో గౌడసంఘం నాయకులు మాటూరి బాలయ్య, గుండ్లపల్లి పెద్ద నర్సింహగౌడ్‌, ఆర్‌ శ్రీధర్‌, సతీశ్‌, టీజేఏసీ కన్వీనర్‌ నాగరాజుగుప్తా తదితరులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం..

ఆత్మకూరు(ఎం) : బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడిన బహుజన విప్లవకారుని జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శమని ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్‌ అన్నారు. సర్దార్‌ సర్వాయిపాపన్న జయంతి సందర్భంగా మండలంలోని పోతిరెడ్డిపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సై ఎండీ ఇద్రిస్‌ అలీ, పాపన్న జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ గనగాని మల్లేశంగౌడ్‌, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు బీసు చందర్‌గౌడ్‌, పోతిరెడ్డిపల్లి సర్పంచ్‌ గనగాని మాధవి, ఆత్మకూరు(ఎం) గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రంగ సత్యనారాయణ, బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్‌ బత్తిని రాజు, గౌడ సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాజాపేటలో..

రాజాపేట : సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు పాండవుల లక్ష్మణ్‌గౌడ్‌, ఎంపీపీ బాలమణీయాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ చామకూర గోపాల్‌ నాయకుడు నాయకులు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, మహేందర్‌గౌడ్‌, సంతోశ్‌గౌడ్‌, ప్రవీణ్‌, వరుణ్‌, పాండు, బాలయ్య పాల్గొన్నారు.

 సర్వాయిపాపన్న జయంతి..

ఆలేరు రూరల్‌ : తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను, మొగులాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన సర్దార్‌ సర్వాయిపాపన్న గౌడ్‌ జయంతిని మండలంలోని గోలనుకొండలో గౌడసంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడసంఘం నాయకులు బీమగాని శ్రీను, చంద్రశేఖర్‌ , మధు, రాజు, కుమార్‌ తదితరులు ఉన్నారు.

గుండాలలో..

గుండాల : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు సుదగాని రామచందర్‌గౌడ్‌, జై గౌడ జిల్లా ఉద్యమ సంఘం అధ్యక్షుడు గూడ మధుసూదన్‌గౌడ్‌ నాయకులు  పాల్గొన్నారు.

భువనగిరి అర్బన్‌ 

భువనగిరి అర్బన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఖిల్లా సమీపంలోని సర్వాయి పాపన్న విగ్రహానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేశారు. అదేవిధంగా భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు ఖిల్లా సమీపంలోని పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని 13వ వార్డులో పాపన్న చిత్రపటానికి తుర్కపల్లి మండల అధ్యక్షుడు బబ్బూరి రవీందర్‌గౌడ్‌ పూలమాల వేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీబీనగర్‌లో.. 

బీబీనగర్‌ : మండలంలోని పలు గ్రామాల్లోని గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. బీబీనగర్‌ మండల కేంద్రంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమాల్లో పంజాల రామాంజనేయులు, ఆగమయ్య, అచ్చయ్య, శ్యాంగౌడ్‌, ఆంజనేయులు, సుర్వి వేణుగౌడ్‌ తదితరులు ఉన్నారు. 

మోత్కూరులో...

మోత్కూరు : సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పోతాయిగడ్డలోని ఆయన విగ్రహానికి గీత పనివారల సొసైటీ, బీసీ విద్యార్థి సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గీత సొసైటీ అధ్యక్షుడు యాదయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ రూరల్‌లో.. 

చౌటుప్పల్‌ రూరల్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా మండల పరిధిలోని ఎల్లగిరిలో కంఠమహేశ్వర స్వామి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి జంగయ్యగౌడ్‌  పాల్గొన్నారు.

వలిగొండలో.. 

వలిగొండ : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో బీసీ సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. 

సంస్థాన్‌నారాయణపురంలో.. 

సంస్థాన్‌నారాయణపురం : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, కిరణ్‌గౌడ్‌, వెంకటేశంగౌడ్‌, యాదయ్యగౌడ్‌, గాలయ్యగౌడ్‌, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.