మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 02:26:53

పంట నష్టం @ 3865 ఎకరాలు

పంట నష్టం @ 3865 ఎకరాలు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  వరుసగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలు నల్లగొండ జిల్లాలో పంటలపై ప్రభావం చూపాయి. జిల్లాలోని 11 మండలాల్లోని 152 గ్రామాల పరిధిలో పంటలు నీళ్లల్లో మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పంటలపై వర్షాల ప్రభావాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. 1,537 ఎకరాల్లో వరి, 2,285 ఎకరాల్లో పత్తి,  33 ఎకరాల్లో పెసర, 10 ఎకరాల్లో చెరుకు పంటల్లో వర్షానికి    నీళ్లు చేరాయి. మొత్తం 3,055 మంది రైతులకు చెందిన 3,865 ఎకరాల్లోని పంట నష్టం జరిగినట్లు  జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.    

   ఇక పంట  నష్టానికి వస్తే ఎనిమిది మండలాల్లోని 73 గ్రామాల పరిధిలోని 278 మంది రైతులకు చెందిన 467 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 251 ఎకరాల్లో వరి, , 192 ఎకరాల్లో పత్తి , 29 ఎకరాల్లో పెసర పంటలకు  నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పంటనష్టాన్ని నిర్ధారించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.