ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 02:26:57

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

అప్రమత్తంగా ఉండాలి:  కలెక్టర్‌

కడ్తాల్‌/కొత్తూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న ముసురు వాన లకు చెరువులు, కుంటల పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం కలెక్టర్‌ మండలంలోని గుర్లకుంట, దేవర చెరువు, రావిచేడ్‌ గ్రామంలోని నాగోజీ చెరువులను ఆర్డీవో రవీందర్‌రెడ్డి తాసిల్దార్‌ మహేం  దర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలకు మత్తడి దుంకుతున్న చెరువులను, కుం టలను ఆయన పరిశీలించారు. చెరువులు, కుంటల విస్తీర్ణంతో పాటు వాటికి సంబంధించిన ఆయకట్టు తదితర వివరాలను అధికారులను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలకు మండలంలో ఏమైనా పంటలు నీట మునిగాయ? పంటలు దెబ్బతిన్నాయా? తదితర విషయాలను అధికారులను అడిగారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అధికారులు స్థానికంగా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడూ సమాచారాన్ని సేకరించి, ఉన్నతాధికారులకు అందించాలని తెలిపారు. అలాగే కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వలోని తాటకుంటను కలెక్టర్‌ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారికి ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చూసు కోవాలని ఆదేశించారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  కొత్తూరు తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.