బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 02:26:57

ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి

ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి

కాలనీల్లో వర్షపునీరు చేరినా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి సబితారెడ్డి అధికారులకు సూచించారు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో ఆమె సోమవారం పర్యటించారు. పలు కాలనీల్లో స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రూ.23 కోట్లతో నిర్మిస్తున్న ట్రంక్‌ లైన్‌ పనుల పురోగతిని  మంత్రి పరిశీలించారు.

     రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : వర్షపునీటి కోసం రూ.23 కోట్లతో నిర్మిస్తున్న ట్రంక్‌ లైన్‌ పనుల పురోగతిని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. సోమవారం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చంద్రగార్డెన్‌ వద్ద నీటి ఉధృతిని పరిశీలించారు. కొన్ని కాలనీలల్లో వర్షపునీరు చేర టంతో ప్రజలకు కలిగిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికే చాలా వరకు పరిస్థితిని చక్కదిద్దిన్నట్లు, ఇంకా సమస్యలుంటే చొరవ చూపాలని కార్పొరేషన్‌ అధికారులకు మంత్రి ఆదేశించారు. ట్రంక్‌లైన్‌కు తాత్కాలికంగా అత్యవసరం ఉన్న వర్షపునీరు సాఫీగా పోయే లా చర్యలు తీసుకుని కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. దాంతో పాటు చెత్తచెదారంను ఎప్పటికప్పుడు తొలగించాలని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట మేయర్‌ దుర్గ దీప్‌లాల్‌ చౌహాన్‌,  డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్‌ సుమన్‌రావు, అధికారులు  ఉన్నారు.