సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 02:27:00

ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయండి

 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయండి

  • జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి 
  • చేవెళ్ల నియోజకవర్గం ఎండీవోలతో సమీక్ష సమావేశం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : మండలాల వారీగా పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఎండీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పల్లె ప్రగతి, ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రైతు వేదికలను దసరా వరకు పూర్తి చేయాలని సూచించారు. అలాగే, కరోనా వైరస్‌ నివారణపై చర్చించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు, వ్యాధులపై అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో జితేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జానకీరెడ్డి, ఎండీవో సత్తయ్య, హరీశ్‌, రామకృష్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.