బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 17, 2020 , 00:27:04

రంగారెడ్డి జిల్లాలో 136 కరోనా పాజిటివ్‌ కేసులు

రంగారెడ్డి జిల్లాలో 136 కరోనా పాజిటివ్‌ కేసులు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జిల్లాలో ఆదివారం 136మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే ప్రాంతంలో 96 కేసు లు నమోదు కాగా... కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మరో 40మందికి వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. శనివారం రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 18925 ఉండగా తాజా కేసులతో 19061 కి చేరుకుంది. జిల్లాలోని బాలాపూర్‌ 5, ఆమనగలు 2, మైసిగండి 1, చించోడ్‌ 2, కొత్తూర్‌ 3, కేశంపేట్‌ 2, నర్కుడ 1, పెద్దషాపూర్‌ 1, నార్సింగి 11, శంకర్‌పల్లి 1, షాబాద్‌ 1, టంగటూర్‌ 2, యాచారం 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 12, మాడ్గుల 1, సరూర్‌నగర్‌ 36, శేరిలింగంపల్లి 49, మైలార్‌దేవ్‌పల్లి 5 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.