గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 00:09:33

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

  • ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం : సీజనల్‌ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనే సుమారు రూ.40లక్షల వ్యయంతో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్‌, కౌన్సిలర్లు మంద సుధాకర్‌, నీలం శ్వేత, యాచారం సుజాత, నీలం శ్వేత, నల్లబోలు మమత, బర్ల మంగ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి పాల్గొన్నారు.