శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 00:09:41

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొత్త ఆర్తిక

ఆదిబట్ల: స్వచ్ఛ మున్సిపాలిటీగా ఆదిబట్లను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చైర్‌పర్సన్‌ కొత్త ఆర్తిక అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట, టీసీఎస్‌ దగ్గర కొత్తగా నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించినట్లు తెలిపారు. మిగతా గ్రామాల్లోనూ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ కోరే కళమ్మ, కౌన్సిలర్లు గోపగల్ల మహేందర్‌, మౌనిక, లావణ్య,  నారని మౌనిక, కంతి సంధ్య,  అర్చన, కమాండ్ల యాదగిరి, కోఆప్షన్‌ సభ్యుడు పల్లెగోపాల్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కోరే జంగయ్య, పైళ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.