శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 00:09:41

వర్షానికి కూలిన ఇండ్లు

వర్షానికి కూలిన ఇండ్లు

మంచాల : మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మంచాల మండలం ఆరుట్లలో శనివారం ఉదయం  రెండు ఇండ్లు కూలిపోయాయి. గ్రామానికి చెందిన పిడుగు రమేశ్‌, బోయపల్లి జంగయ్యలకు చెందిన పెంకుటిండ్లు కూలిపోవడంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు ఎండీ సద్దాం, వెంకటేశ్‌, మల్లేశ్‌ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

విస్తారంగా వర్షాలు

కడ్తాల్‌ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. రెండేండ్ల తర్వాత మండల కేంద్రంలోని గుర్లకుంట నిండి మత్తడి దుంకుతున్నది.