బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 00:10:01

మువ్వ‌న్నెల రెప‌రెప‌లు

మువ్వ‌న్నెల రెప‌రెప‌లు

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె, పట్టణం, ఊరూ, వాడాల్లో మువ్వన్నెలా జెండా రెపరెపలాడింది. శనివారం రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్లు కొనియాడారు. రంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు పరిశ్రమలు నెలకొల్పేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు, దివ్యాంగులకు చెక్కు లు అందజేశారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఎడతెరిపిలేని వర్షం కురిసినా లెక్క చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. కొంద రు గొడుగులు పట్టుకుని, మరి కొందరు వర్షంలో తడుస్తూనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తమ జాతీయ భావాన్ని చాటి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన పలువురు సమరయోధుల త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు.

న్యూస్‌ నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జాతీయజెండా ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కృపయ్య, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దారు వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కార్యాలయంపై చైర్‌పర్సన్‌ స్రవంతి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి, పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ యాదగిరిరెడ్డి, ఇబ్రహీంపట్నం కోర్టులో మెజిస్ట్రేట్‌ పద్మావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, దండుమైలారం సహకారసంఘం కార్యాలయంలో చైర్మన్‌ బిట్ల వెంకట్‌రెడ్డి, పోల్కంపల్లి సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి జెండాను ఎగురవేశారు.  

l అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఎంపీపీ బుర్ర రేఖామహేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ కొలన్‌ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

l యాచారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాష, తాసిల్దారు కార్యాలయంలో తాసిల్దారు నాగయ్య, పోలీస్‌స్టేషన్‌లో సీఐ లింగయ్య, సొసైటీ బ్యాంకులో సింగిల్‌విండో చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ దవాఖాన ఎదుట డాక్టర్‌ నాగజ్యోతి, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో  సందీప్‌, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ సీతారాములు, యాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ శ్రీధర్‌రెడ్డి, మాల్‌లో జడ్పీటీసీ జంగమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు. కా 

l ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొత్త ఆర్తిక జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ కోరే కళమ్మ, కమిషనర్‌ సరస్వతి పాల్గొన్నారు. 

l మంచాల మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దారు దేవోజా, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నర్మద, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో జ్యోతిశ్రీ, పోలీస్టేషన్‌లో సీఐ వెంకటేశ్‌ గౌడ్‌, ఆరుట్ల, మంచాల ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్‌  అరుణాతారా, కిరణ్‌ కుమార్‌,  విద్యుత్‌ కార్యాలయంలో లైన్‌ ఇనెస్పెక్టర్‌ చిన్నారెడ్డి, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ బుస్సుపుల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

l పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో చైర్‌పర్సన్‌ స్వప్న,  వైస్‌ చైర్‌పర్సన్‌ సంపూర్ణరెడ్డి, కమిషనర్‌ బలరాం పాల్గొన్నారు. 

l ఆమనగల్లు  మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ అనిత, సింగిల్‌విండో కార్యాలయం ఆవరణలో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆవరణలో మండల అధ్యక్షుడు నిట్టనారయణ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

l మాడ్గుల మండలంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ పద్మ, ప్యాక్స్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి, తాసిల్దారు పురుషోత్తం, సీఐ సైదులు, ఎంపీడీవో ఫారూఖ్‌హుస్సేన్‌, పశువైద్యాధికారులు శేఖర్‌, రేఖ, పీహెచ్‌సీ వైద్యులు లలిత, శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఏఈ రామకృష్ణ, ఎంఈవో రామాంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని జయరాంతండాలో యువజన సంఘం ఆధ్వర్యంలో  చిన్నారులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలైన చిన్నారులకు సర్పంచు రూపాదేవిలాల్‌ శనివారం బహుమతులు అందజేశారు. 

l తలకొండపల్లి తాసిల్దారు కార్యాలయం వద్ద  తాసిల్దారు శ్రీనివాస్‌, మండల పరిషత్‌ కార్యలయం వద్ద ఎంపీపీ నిర్మల, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎసై వరప్రసాద్‌, సింగిల్‌విడో కార్యాలయంలో కేశవరెడ్డి, ఎంఆర్‌సీ కార్యలయంలో ఎంఈవో సర్దార్‌నాయక్‌ జాతీయ జెండాలను ఎగరవేశారు. 

l కడ్తాల్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, తాసిల్దారు కార్యాలయం వద్ద తాసిల్దారు మహేందర్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో సుందరయ్య, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏవో శ్రీలత జాతీయ జెండాలను ఎగురవేశారు.