శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 00:10:04

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా అధికారు లు, మండలస్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులను తమ కార్య స్థావరంలో ఉండాలని ఆదేశించామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో 040-23230813/ 23230817 అనే ఫోన్‌ నెంబర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర, ఎమర్జెన్సీ అవసరాలకు పై నెంబర్లకు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. బంగాళాఖాతంలో మరో వాయు గుండం ఏర్పడడంతో ఆది, సోమవారం రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.