ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 01:13:20

ప్రజల చెంతకే వైద్యం..ప్రజల చెంతకే వైద్యం..

ప్రజల చెంతకే వైద్యం..ప్రజల చెంతకే వైద్యం..

  • ఆరోగ్య తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కృషి..
  • m విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
  • m ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో బస్తీ దవాఖానలు ప్రారంభం 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద ప్రజల కోసమే బస్తీ దవాఖానలు ఏర్పా టు చేశారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గం హస్తినపురం డివిజన్‌ పరిధిలోని భూపేష్‌ గుప్తా నగర్‌, మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వీరన్నగుట్టలలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , స్థానిక కార్పొరేటర్లు , వైద్య, తదితర శాఖల అధికారులతో కలిసి బస్తీ దవాఖానలను ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. నగరవాసుల కోసం ఇప్పటికే 170 దవాఖానలు ప్రారంభించగా వార్డుకు రెండు చొప్పున ఏర్పాటు చేయడమే లక్ష్యంగా, మరో 26 ప్రారంభం అవుతున్నాయని, దీంతో వీటి సంఖ్య 196కు చేరుతుందన్నారు . పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడిలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌  తీవ్ర కృషి చేస్తున్నారని అన్నారు. తాజాగా ప్రైవేటు దవాఖానల్లో 50 శాతం బెడ్లను ప్రభుత్వమే కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. logo