బుధవారం 30 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 13, 2020 , 00:23:15

నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం

నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం

  • వికారాబాద్‌లో పాల్గొననున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, 
  • తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి
  •  వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు
  • రంగారెడ్డి కొత్త కలెక్టరేట్‌లోనే పంద్రాగస్టు కార్యక్రమాలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి సబితారెడ్డి\

వికారాబాద్‌: ఈ నెల 15న స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకలను వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్‌ పౌసుమి బసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో స్వాత్రంత్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ కోవిడ్‌ 19 దృష్ట్యా  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్‌ పద్మరావు హాజరై ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరిస్తారని స్పష్టం చేశారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సంబంధిత అధికారులు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, జిల్లా ఎస్పీ నారాయణ, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, ఈఈ ఆర్‌అండ్‌బీ, డీఎస్పీ, సివిల్‌ సైప్లె అధికారి రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

జెండా ఆవిష్కరణ చేయనున్న  మంత్రి 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్దనే పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ం జాతీయ జెండా ఎగురవేయడానికి జిల్లా మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించనున్నారు. కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. జాతీయ జెండా ఆవిష్కరణలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్‌ పర్సన్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మ న్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొంటారు. ఈ అంశంపై జిల్లా డీఆర్వో హరిప్రియ, కలెక్టరేట్‌ ఏవో సుశీల పర్యవేక్షిస్తున్నారు. 

తాజావార్తలు


logo