బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 00:04:33

బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ కృషి

 బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ కృషి

  •  టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా l కార్యాలయాన్ని రాష్ర్టానికే  ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
  • అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ ప్రారంభిస్తారుl
  • ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి  రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • శంషాబాద్‌లో పార్టీ ఆఫీసు l నిర్మాణ  పనుల పరిశీలన

 శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభిచనున్న ట్లు ఎమ్మెల్సీ, రైతు బంధు  సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం శంషాబాద్‌ హుడా పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పార్టీ కార్యాలయ పనులను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. అ నంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నా టారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షు డి హోదాలో నూతన కార్యాలయాన్ని ప్రా రంభించి కార్యకర్తలకు మరింత శిక్షణ ఇవ్వడంతో పాటు పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. శంషాబాద్‌లోని నిర్మించే జిల్లా పార్టీ కార్యాలయాన్ని రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధించేందుకు సీ ఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకా లు ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ కార్యాలయా లు వేదికగా ఉపయోగపడుతాయని అన్నారు. కా ర్యాలయ నిర్మాణాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఎప్పటికపుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో శంషాబాద్‌ ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మా మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అమృతారెడ్డి, మండల పార్టి అధ్యక్షుడు చంద్రారెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు డి.వెంకటేశ్‌, సొసైటి మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, చైర్మన్‌ మల్లారెడ్డి, నీరటి రాజు, శ్రీకాంత్‌యాదవ్‌, మోహన్‌రావు, ప్రసాద్‌, జీవై ప్రభాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

 శంకర్‌పల్లి రూరల్‌: మండలంలోని కొండకల్‌ గ్రా మంలో ఏర్పాను చేస్తున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ పనులను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి శనివా రం పరిశీంలించారు. పనులు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ నెల 13న రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ పెద్దఎత్తున పరిశ్రమలను మన రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నాయకులు పాల్గొన్నారు.