బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 07, 2020 , 00:04:55

జయశంకర్‌ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో గొప్పది

జయశంకర్‌ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో గొప్పది

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్‌ నింపిన స్ఫూర్తి ఎంతో గొప్పదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జయశంకర్‌ జయంతి సందర్భంగా నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో మంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో గొప్పదన్నారు. తొలిదశ ఉద్యమం నుంచి చివరి శ్వాస వరకు స్వరాష్ట్ర సాధన కోసం పనిచేసిన మహానీయుడని, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే,దుబ్బాక ఎమ్మెల్యే సోలీపేట రామలింగారెడ్డి మృతి పట్ల  మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కలెక్టరేట్‌లో ‘సార్‌'కు నివాళి...

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పూల మాల వేసి నివాళ్లలర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, డీఆర్‌వో హరిప్రియ, కలెక్టరేట్‌ ఏవో తదితరులు పాల్గొన్నారు.