బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 04, 2020 , 23:13:25

బీటీ రోడ్ల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

బీటీ రోడ్ల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

 కడ్తాల్‌: గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. రూ.20.40కోట్లతో కడ్తాల్‌ నుంచి తలకొండప ల్లి చౌరస్తా వరకు నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు పనులను, మండల కేంద్రంలో రూ.22లక్షలతో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను మంగళవారం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కరోనా వైరస్‌ నేపథ్యంలో సైతం డబుల్‌ రోడ్డు నిర్మాణాని కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేసి...కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల ప్రజల కలను నెరవేర్చారని తెలిపారు. కడ్తాల్‌ నుంచి తలకొండపల్లి చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు విస్తరణతో రవాణ సౌకర్యం మెరుగవుతుందన్నారు.రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ డబుల్‌ రో డ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, రోడ్డుతో రెండు జిల్లాల మ ధ్య దాదాపు 20కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. రూ. 1.60కోట్లతో కడ్తాల్‌ నుంచి చల్లంపల్లి, సాలార్‌పూర్‌ గ్రామాల మీదుగా పడకల్‌ గేట్‌ వరకు చేపట్టనున్న రోడ్డు రెన్యువల్‌కు ఆ మనగల్లు, తలకొండపల్లి మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ ప నులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.గ్రామాల నుంచి మండ ల కేంద్రాలకు వెళ్లే రో డ్లన్నీ బీటీ రోడ్లుగా మారుస్తామని,పెండింగ్‌లో ఉన్న బీటీ పనులు పూర్తి చేస్తామని వివరించారు. 

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

 రాష్ట్రంలోని ప్రతి రైతును రాజుగా చేయడమే ముఖ్యమం త్రి కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదికను ఎమ్మె ల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇం దులో భాగంగానే రైతులకు సమగ్ర సమాచారమందించడానికి రైతు వేదికలను నిర్మిస్తుందని తెలిపారు. నిర్ణీత గడువులోగా రైతు వేదికలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, హరిచంద్‌నాయ క్‌, తులసీరాంనాయక్‌, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, గోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ వీరయ్య, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, వార్డు సభ్యులు భిక్షపతి, మహేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జహంగీర్‌ అలీ, తాసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, వ్య వసాయశాఖ ఏవో శ్రీలత, ఎస్‌ఐ సుందరయ్య,పీఆర్‌ ఏఈ వెంకట్‌రెడ్డి, లాయక్‌అలీ, రాజేందర్‌యాదవ్‌, కస్ననాయ క్‌, రాంచందర్‌నాయక్‌, లింగం, ప్రవీణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.