బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 04, 2020 , 23:08:27

పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై చైతన్య కార్యక్రమాలు

పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై చైతన్య కార్యక్రమాలు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రకృతి వనాల నిర్మాణంలో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం  లో నిలిచినట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అర ఎకరం స్థలంలో ప్రకృతి వనా లు పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. జిల్లాలో మొత్తం 560 పంచాయతీల్లో 438 పల్లె ప్రకృతి వనాలు పెంచేందుకు స్థలాలను జిల్లా యంత్రాంగం సేక రించందని పేర్కొన్నారు. 438 గ్రామాల్లో ఇప్ప టికే పల్లె ప్రకృతి వనాలను పెంపు పనులు ప్రారం భమయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం వనాల ఏర్పా టు పూర్తి చేసినట్లు వివరిం చారు. 

రాష్ట్రంలో సుమారుగా భూసేకరణ జరిగిన 43శాతం భూముల్లోనే వనాల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లాలోని పంచా యతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో కూడా పల్లె వనాలకు భూములు గుర్తించాలని, ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాల పరిరక్షణ, నిర్వహణ, కాపలాతో సహా పనులను చేపట్టడా నికి కనీసం ముగ్గురు లేదా నలుగురు సభ్యులను గుర్తించి వారిని నియమించాలని కలెకర్‌ అధికారు లను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల నిర్వ హణ బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు. అర ఎకరం భూమిలో రెండు వేల మొక్కలు నాటాలని, 30 గుంటల భూమిలో మూడు వేల మొక్కలు నాటాలని, ఎకరం స్థలం లో నాలుగు వేల మొక్కలు నాటాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికీ స్థల సేకరణ పూర్తి కాని గ్రామాలు, అనుబంధ గ్రామాల్లో త్వరితగతిన సేకరణ పనులు పూర్తి చేయాలని  అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాలుగా ప్రకటించేందు  కు చర్యలు చేపట్టినట్లు రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీం కేసీఆర్‌  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానం పొందినట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా  పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో  8 నుంచి 15వ తేదీ వరకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై భారీ స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పల్లె ప్రగతిలో అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి, జిల్లాలోని అన్ని గ్రామాల్లో గందగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామీణుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చైతన్యం కల్పించేలా ప్రతి రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. 8న జిల్లాలోని సర్పంచ్‌లతో కలెక్టర్‌ ఈ-నైట్‌ సమావేశం నిర్వహణ. 9న గ్రామాల్లో సర్పంచ్‌ల నేతృత్వంలో సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ ఏరివేత. 10న పంచాయతీ, ప్రభుత్వ భవనాలను శుభ్రపరిచి, వైట్‌ వాష్‌ వేయడం లాంటి శ్రమదానం చేయడంతో పాటు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18001800404 అనే ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ విధానం ద్వారా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాల ఏర్పాటుపై చైతన్య కార్యక్రమం. 11న స్వచ్ఛభారత్‌ మిషన్‌ అందించిన ఐదు వేర్వేరు చిత్రాలను పంచాయతీల గోడలపై పెయింట్‌ చేయించాలి. 12న గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహణ. 13న మురికి రహిత నా గ్రామం అనే అంశంపై 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ చిత్రలేఖన పోటీల నిర్వహణ. 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించడం. వీటిని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తి మంత్రిత్వశాఖ వెబ్‌ ఆధారిత పరిశీలన నిర్వహిస్తారు. 14న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణ. 15న జిల్లాలోని గ్రామాలను ఓడీఎఫ్‌లుగా ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.