సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:08:59

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

మహేశ్వరం: సీఎం సహాయనిధి పేదలకు వరమని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కొత్వాల్‌ చెరువు తండా గ్రామానికి చెందిన జాటోతురెడ్యా సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ. 22 వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆదివారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్‌, ఉప సర్పంచ్‌ లక్ష్మణ్‌ నాయక్‌, జాటోతు రవి తదితరులు పాల్గొన్నారు.