గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:09:03

రైతు వేదిక భవనాలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక భవనాలను త్వరగా పూర్తి చేయాలి

  • - ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్‌లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆదివారం సాయంత్రం సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ జోగు వీరయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి  అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అన్ని విధాలా ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తుందన్నారు. వాటి ద్వారా వ్యవసాయశాఖ అధికారులు అన్నదాతలకు సమగ్ర సమాచారాన్ని అందజేస్తారని చెప్పారు. కడ్తాల్‌, ముద్విన్‌, రావిచేడ్‌, మక్తమాదారం గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ముద్విన్‌, పల్లెచెల్కతండా సర్పంచ్‌లు యాదయ్య, లోకేశ్‌నాయక్‌, ఉప సర్పంచ్‌ వినోద్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు జంగయ్యయాదవ్‌, నాయకులు రాఘవరెడ్డి, గోపాల్‌, జంగయ్యగౌడ్‌, దీప్లానాయక్‌, రాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.