గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:09:03

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి

  •  uప్రతి నియోజకవర్గంలో 20ఎకరాల్లో గోదాముల నిర్మాణం 
  • uరైతు వేదికలతో ఎంతో ఉపయోగం
  • uనకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కు పాదం... 
  • uనియంత్రిత పంటల సాగుపై రైతుల ఆసక్తి
  • uవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి  
  • uశంకర్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఆవరణలో 
  • ఏఎంసీ కార్యాలయం ప్రారంభోత్సవం 
  • uచేవెళ్ల మండలం కౌకుంట్లలో అభివృద్ధి పనుల పరిశీలన
  • సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు రైతుల శ్రేయస్సు కోసం ఎంతో పాటు పడుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ.55లక్షలతో నిర్మించిన నూతన ఏఎంసీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టించి పండిచిన పంటను నిల్వచేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 20ఎకరాల్లో ప్రభుత్వం గోదాములను నిర్మించనున్నదని తెలిపారు.  ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగును పాటిస్తూ రైతులు మక్కజొన్నకు బదులుగా పత్తి, కందులు, జొన్నలు, ఇతర పంటలను సాగు చేయడం సంతోషకరమన్నారు. అదేవిధంగా, చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు.

- శంకర్‌పల్లి/చేవెళ్ల రూరల్‌


శంకర్‌పల్లి: ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాలలో ప్రభుత్వం గోదాములను నిర్మించనున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన నూతన ఏఎంసీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల శ్రేయస్సు కోసం ఎంతో పాటు పడుతున్నారని కొనియాడారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు మక్కజొన్న పంటకు బదులుగా పత్తి, కందులు, జొన్నలు, ఇతర పంటలను సాగు చేయడం సంతోషకరమన్నారు. కరోనా  ప్రభావం ఉన్నా రైతు బంధు పథకాన్ని వంద శాతం విజయవంతం చేశామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి మండలంలో గోదాములను నిర్మిస్తున్నదని తెలిపారు.  చేవెళ్ల నియోజక వర్గంలోని ఎన్కేపల్లి వద్ద 20 ఎకరాల్లో అదనపు గోదాములు నిర్మించడానికి స్థలం సేకరించినట్లు తెలిపారు. శంకర్‌పల్లి ఏఎంసీ మార్కెట్‌ లో రైతు బజార్‌ నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. శంకర్‌పల్లి ఏఎంసీ అభివృద్ధికి మేడ్చల్‌, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌లు ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సబావత్‌ రాజునాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బీ.శశిధర్‌రెడ్డి,  రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు, మున్సిపాలిటి వైస్‌ చైర్మన్‌ బీ.వెంకట్‌రాంరెడ్డి, మండల కన్వీనర్‌ కే గోపాల్‌, వర్తక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ డీ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్‌ శేరి అనంత్‌రెడ్డి, శంకర్‌పల్లి మాజీ సర్పంచ్‌ బీ శ్రీధర్‌, మాజీ ఉప సర్పంచ్‌ సాత ప్రవీణ్‌కుమార్‌, తాసిల్దార్‌ కృష్ణకుమార్‌, ఎంపీడీవో సత్తయ్య, మార్కెటింగ్‌ శాఖ డీఈ నాగేశ్వర్‌రావు, మార్కెట్‌ కార్యదర్శి వెంకటయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జైత్‌రామ్‌, నాయకులు మాణిక్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కే.రవీందర్‌, పాలక వర్గం సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

చేవెళ్ల రూరల్‌ : గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. మండలంలోని కౌకుంట్ల గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల వద్ద చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌, విద్యాకమిటీ సభ్యులను ఆదేశించారు. పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని గ్రామ కోఆప్షన్‌ సభ్యుడు, మాజీ ఉప సర్పంచ్‌ మల్లారెడ్డికి మంత్రి సూచించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. హరితహారాన్ని యజ్ఞంలా చేపట్టాలని సూచించారు. అనంతరం పంచాయతీ భవనాన్ని పరిశీలించి వివిధ విభాగాల కమిటీ సభ్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల కమిటీ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కమిటీలు బాగా పని చేయాలని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. 

పేదలకు ఇండ్లు మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే 

ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. సుమారు 20 ఇండ్ల వరకు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రకృతి వనానికి స్థలాన్ని కేటాయించి పనులు ప్రారంభించాలని సూచించారు.  కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, సర్పంచ్‌ గాయత్రీ గోపాలకృష్ణ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్‌, ఉప సర్పంచ్‌ ఇనాయత్‌ అలీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.