శనివారం 08 ఆగస్టు 2020
Rangareddy - Aug 02, 2020 , 00:54:28

నిరాడంబరంగా ఈద్‌ ఉల్‌ జుహ

నిరాడంబరంగా ఈద్‌ ఉల్‌ జుహ

  • ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ వేడుకలు
  • ఇండ్లలోనే ప్రార్థనలు చేసిన ముస్లింలు
  • సామూహిక ప్రార్థనలకు దూరం
  • ఈద్గాలు, మసీదుల వద్ద భారీగా పోలీసు బందోబస్తు

త్యాగానికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-జుహ) పండుగను ముస్లింలు శనివారం నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముస్లింలంతా తమతమ ఇండ్లల్లోనే భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని నమాజ్‌ చేసి అల్లాను ప్రార్థించారు. అనంతరం ఒకరినొకరు ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్నారు. కరోనా నేపథ్యంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయకుండా ఈద్గా, మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ వేడుకలను  నిర్వహించినందుకు ముస్లింలకు పోలీసులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.   

-న్యూస్‌నెట్‌వర్క్‌, రంగారెడ్డి/ వికారాబాద్‌


logo