మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 01, 2020 , 00:01:13

రంగారెడ్డి డీపీవోగా శ్రీనివాస్‌రెడ్డి

రంగారెడ్డి డీపీవోగా శ్రీనివాస్‌రెడ్డి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి డీపీవోగా కె.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఖమ్మం డీపీవోగా పనిచేస్తున్న ఆయనను జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. నిన్నటివరకు డీపీవోగా పనిచేసిన కె.పద్మజారాణి మేడ్చల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. సోమవారం లేదా మంగళవారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన స్వస్థలం హన్మకొండ. ఉమ్మడి, నూతన రంగారెడ్డి జిల్లాలో ఐదేండ్ల పాటు డీపీవోగా సేవలందించిన పద్మజారాణి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పంచాయతీలకు చెందాల్సిన విలువైన భూములను ఆమె కాపాడారు. గ్రామపంచాయతీల పరిధిలో వెలుస్తున్న వెంచర్ల విస్తీర్ణంలో 10 శాతం భూమిని విధిగా పంచాయతీకి కేటాయించారు. వివిధ ప్రాంతాల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కిన రియల్టర్ల ఆట కట్టించి..10శాతం భూమి పంచాయతీల పరం అయ్యేలా చేయడంలో ధైర్యం చూపించి విజయం సాధించారు. ఐదేండ్లలో దాదాపు 2,500 ఎకరాలకు పైగా భూమిని పంచాయతీలకు దక్కేలా చర్యలు తీసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 నుంచి 4వేల కోట్ల పైగానే ఉంటుంది.