శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 01, 2020 , 00:01:29

మైనార్టీలకు బక్రీద్‌ శుభాకాంక్షలు

మైనార్టీలకు బక్రీద్‌ శుభాకాంక్షలు

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : బక్రీద్‌ పండుగ సేవానిరతికి ప్రతీక అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బక్రీద్‌ పండుగ సందర్భంగా మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, స్థోమత ఉన్న ముస్లిం సోదరులు ఖుర్బానీ ద్వారా పేదలకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. అందరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. బక్రీద్‌ పండుగను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు అండగా నిలువడానికి అందరూ ముందుకు రావాలన్నారు. కరోనా నుంచి విశ్వ మానవాళి రక్షణ కోసం ప్రార్థించాలని మంత్రి  కోరారు.