మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 01, 2020 , 00:01:35

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

మహేశ్వరం: మహేశ్వరంలో  నిర్మిస్తున్న మోడల్‌ రైతు వేదిక పనులను పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌  సెక్రటరీ సందీప్‌ సుల్తానియా, రంగారెడ్డి  కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ శుక్రవారం పరిశీలించారు. రైతు వేదిక పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. అధికారులు మోడల్‌ రైతు వేదిక పనులను దగ్గర ఉండి పర్యవేక్షించాలన్నారు. అనంతరం హరిత హారంలో భాగంగా సిరిగి పురం గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం దుబ్బచర్ల, నాగారంలో  రైతు వైదిక పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీడీవో నర్సింహులు, మిద్దెల అశోక్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.