మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Jul 30, 2020 , 00:30:53

పెరుగుతున్న కరోనా కేసులు

పెరుగుతున్న కరోనా కేసులు

  • - ఇబ్రహీంపట్నంలో 27 మందికి ..
  • - యాచారంలో ఏడుగురికి పాజిటివ్‌

ఇబ్రహీంపట్నం: రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే బుధవారం అన్ని పీహెచ్‌సీల్లో కలిపి 174 మందికి పరీక్షలు నిర్వహించగా.. 27 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అందు లో అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీలో 14, యాచారం 7, ఇబ్రహీంపట్నం 3, మంచాల 1,  ఎలిమినేడులో 2  కేసులు నమోదైనట్లు తెలిపారు. 

యాచారంలో 

యాచారం: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో  24మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయ గా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి నాగజ్యోతి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి, మల్కీజ్‌గూడ, తాడిపర్తి, తమ్మలోనిగూడకు చెందినవారు ఒక్కొక్కరు, మహేశ్వరం నివాసితులు ఇద్దరు, అబ్దుల్లాపూర్‌మెట్‌వాసి ఒకరు ఉన్నట్లు తెలిపారు.