ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Jul 27, 2020 , 00:49:25

లారీని ఢీకొన్న డీసీఎం : డ్రైవర్‌ దుర్మరణం

లారీని ఢీకొన్న డీసీఎం : డ్రైవర్‌ దుర్మరణం

ఆదిబట్ల: ఔటర్‌ రింగు రోడ్డుపై బండల లోడుతో వెళ్తున్న ఓ లారీ టైరు పగలడంతో ఒక్కసారిగా ఆగింది. దీంతో వెనుకాల వస్తున్న డీసీఎం లారీ  ని ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావిర్యాల ఔటర్‌ రింగు రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. సీఐ నరేందర్‌ కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లా, డోన్‌ నుంచి మిర్చి లోడుతో డీసీఎం వరంగల్‌కు బయలు దేరింది. రావిర్యాల ఔటర్‌ రింగు రోడ్డుపై బం డల లోడ్‌తో వెళ్తున్న లారీ టైరు పగిలి ఆగింది. లారీ వెనుకాలే మిర్చి లోడు తో వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టింది. దీంతో కర్నూల్‌ జిల్లా డోన్‌ సమీపంలోని కొత్తపేటకు చెందిన డీసీఎం డ్రైవర్‌ ఎరుకల తిమ్మరాజు (30) మృతి చెందాడు. అలాగే డోన్‌కు చెందిన క్లీనర్‌ యాదగిరి రాజుకు గాయాలయ్యా యి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీఎంలో ఇరుక్కున్న  తిమ్మరాజును బయటకు తీశారు. అప్పటికే అతను మృతి చెందాడు.  క్షతగాత్రుడు రాజును చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.