గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 26, 2020 , 01:00:54

అత్యవసరమైతేనే కార్యాలయానికి రావాలి

అత్యవసరమైతేనే కార్యాలయానికి రావాలి

నందిగామ : కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తాసిల్దార్‌ కార్యాలయానికి రావాలని తాసిల్దార్‌ హైదర్‌ అలీ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షా ద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు తాసిల్దార్‌ కార్యాలయాల్లో పలువురు సి బ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అన్నారు. చిన్న చిన్న పనుల కోసం ఇద్దరు, ముగ్గురు కార్యాలయానికి రాకూడదని, అత్యవసర పని ఉంటే ఒక్కరు మాత్రమే రావాలని తాసిల్దార్‌ విజ్ఞప్తి చేశారు.

ఆరుగురికి కరోనా పాజిటివ్‌

 మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 22 మందికి కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి ఫల్గుణదేవి తెలిపారు. లక్షణా లు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తామని, టెస్టులకు వచ్చే వారు ఆధార్‌ కార్డు వెంట తెచ్చుకోవాలని వైద్యాధికారి సూచించారు.