శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 25, 2020 , 00:05:37

ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండ

ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండ

  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
  • అన్మాస్‌పల్లికి చెందిన బాధితురాలికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

కడ్తాల్‌ : ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనారోగ్యంతో  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందింది. అనంతరం ఆమె సీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్యే సహకారంతో రూ.60,000 వేలు మంజూరయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్‌, నాయకులు జయప్రకాశ్‌, వెంకటయ్యగౌడ్‌, భాస్కర్‌రావు, లాయక్‌అలీ, నాగులు, గణేశ్‌, బాలేమియా, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.