గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 25, 2020 , 00:04:49

ఇంటిపెద్దను హత్య చేశారు

 ఇంటిపెద్దను హత్య చేశారు

  •   గొంతు నులిమి  చంపిన భార్య, కొడుకు, కూతురు

చేవెళ్ల రూరల్‌: ఇంటి పెద్దను హత్య చేసిన ఘటన మండలంలోని మల్కాపూర్‌లో జరిగింది. సీఐ సీహెచ్‌.బాలకృష్ణ కథనం వివరాల ప్రకారం.. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన నార్ల వెంకటయ్య (40), భార్య కమలమ్మ, కొడుకు శివకుమార్‌(15), కూతురు సాయిలక్ష్మి (20)తో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారువెంకటయ్య ప్రతి నిత్యం మద్యం సేవిస్తూ ఇంట్లోవాళ్లను తరచూ వేధింపులకు గురి చేయడంతో విసుగు చెందిన భార్య, కొడుకు, కూతురు గురువారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటయ్య గొంతుకు నైలాన్‌ తాడు బిగించి హత్య చేశారు. ధర్మసాగర్‌ గ్రా మానికి చెందిన చంద్రమ్మ శుక్రవారం ఉద యం మల్కాపూర్‌ గ్రామానికి వెళ్లి చూడగా తమ్ముడు వెంకటయ్య మృతి చెందడంతో బోరున విలపించింది. భార్య, కూతరు, కుమారుడిపై అనుమానం రావడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, కొడుకు, కూతురిని విచారించడంతో తరచూ మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తుండడంతో తామే హత్య చేశామని తెలిపారని సీఐ వివరించారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.