మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 25, 2020 , 00:04:35

ఎల్బీనగర్‌లో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌

ఎల్బీనగర్‌లో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌

  • 10 ఎకరాల స్థలాన్ని స్వచ్ఛందంగా కేటాయించిన వీఎం హోంట్రస్ట్‌

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: సహజ వనరుల అభివృద్ధిలో భాగంగా యాదాద్రి మోడల్లో భారీ ఎత్తున వివిధ రకాల మొక్కలను ఏపుగా పెంచేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మొక్క లు నాటేందుకు మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు మొక్కలు నాటి ఈ పనులను ప్రారంభించారు. ఈ నెల 31 వరకు రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు పనులను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్‌ జోన్‌ కొత్తపేట పండ్ల మార్కెట్‌ వెనుక ఉన్న విక్టోరియా మెమోరియల్‌ హోంట్రస్టుకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌కు స్వచ్ఛందంగా కేటాయించారు. ఆ స్థలంలో ఆధునిక పద్ధతిలో ఎత్తుగా, మధ్యస్తంగా, చిన్నగా పెరిగే చెట్లను మూడు వరుసలుగా నాటుతారు. తదుపరి ఆ చెట్ల మధ్యలో ఔషధ, పూల మొక్కలను పెంచుతారు. ఈ మోడల్లో సహజ అడవులను తలపించే చెట్లు రెండు సంవత్సరాల్లో ఏపుగా పెరిగి దట్టంగా మారతాయి.