బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 25, 2020 , 00:04:02

చేవెళ్లలో 15 మందికి కరోనా పాజిటివ్‌

చేవెళ్లలో 15 మందికి కరోనా పాజిటివ్‌

చేవెళ్ల : కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రదీప్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియ దవాఖానలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పాటిజివ్‌ వచ్చిన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కేశంపేటలో 9 మందికి... 

కేశంపేట : కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక వైద్య బృందం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ని నిర్వహించిన వైద్య శిబిరంలో 25మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 8మంది పోలీస్‌ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా కాకునూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు వైద్య బృందం తెలిపారు.