గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Jul 23, 2020 , 23:37:19

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 

కొందుర్గు : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదల కు వరమని ఎమ్మెల్యే అంజయ్యయాద వ్‌ అన్నారు. గురువారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు చెక్కులను ఎమ్మె ల్యే నివాసం ఎక్లాస్‌కాన్‌పేటలో అందజేశారు. కొందుర్గు గ్రామానికి చెందిన నరేందర్‌కు రూ.60వేలు, ముట్పూర్‌ గ్రామానికి చెందిన రంగమ్మ రూ.60వేలు, అయోధ్యపూర్‌ తండాకు చెందిన రాజునాయక్‌ రూ.54 వేలు, తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ రూ.52వేలు, విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన బి.నర్సింహులు రూ.36వేలు, ఎస్‌.నర్సింహులుకు రూ.15వేల చెక్కులను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నదన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాజేశ్‌పటేల్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

‘పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం’

కొత్తూరు రూరల్‌ : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సత్యనారాయణ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో పంపి ణీ చేశారు. మండలంలోని ఖాజీగూడ తండాకు చెందిన కె.మంజుల, మల్లాపూర్‌ గ్రామానికి చెం దిన సుభాష్‌రెడ్డి, పెంజర్ల గ్రామానికి చెందిన స త్యనారాయణచారి, మండల కేంద్రానికి చెందిన కె.అనురాధ, డి.సరిత అనారోగ్యానికి గురవడం తో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానల్లో చేర్పించి చికిత్సలు నిర్వహించారు.

వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుం బ సభ్యులు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేశా రు. దీంతో మంజులకు రూ.32వేలు, సుభాష్‌రెడ్డి రూ.60వేలు, సత్యనారాయణచారి రూ.21500 లు, అనురాధ రూ.12వేలు, సరితకు రూ.12 వే లు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కా ర్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షు డు సంతోష్‌నాయక్‌, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ వసుంధర, ఎంపీటీసీ అంజమ్మ, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు రాఘవేందర్‌యాదవ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ భీమయ్య, నాయకులు పాల్గొన్నారు.