శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 23, 2020 , 23:24:18

సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుద్దాం: మంత్రి సబితారెడ్డి

సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుద్దాం: మంత్రి సబితారెడ్డి

  • మ్ంరత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మాస్కులు పంపిణీ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పిలుపుమేరకు ఇబ్బందిలో ఉన్నవారికి.. ఆపదలో ఉన్నవారికి ఆసరాగా ఉండాలని, వస్తు రూపంలో గాని.. ధన రూపంలో గాని.. మరే ఇతర వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ సూచనలకు అనుగుణంగా గురువారం నగరంలోని మంత్రి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కపాటి పాండురంగారెడ్డి తయారు చేయించిన మాస్క్‌లను గురువారం సబితారెడ్డి పంపిణీచేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించిన మంత్రి కేటీఆర్‌ సంపూర్ణ జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్‌ మాస్క్‌ను గ్రామాల్లో సంచరించే వారు తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్‌ కంటేకారు మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కందుకూరు మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, కందుకూరు మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్‌రెడ్డి, రైతు బంధు కో-ఆర్డినేటర్‌ గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యువజన విభాగం నాయకుడు కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, గడ్డి అన్నారం మాజీ డైరెక్టర్‌ బొర్ర జగన్‌రెడ్డి పాల్గొన్నారు.