బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 20, 2020 , 23:54:23

పూడికతీతకు శ్రీకారం

పూడికతీతకు శ్రీకారం

మహేశ్వరంలో ఐదు చెరువుల్లో పనులు ప్రారంభం

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మహేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెడుతున్నది. అం దులో భాగంగా చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు మిషన్‌ కాకతీయ, జలహితం పథకాలకు శ్రీకారం చు ట్టింది. దీంతో పూడికతీత పనులను చేపడుతున్నారు. మహేశ్వరం మండలంలో వందకు పైగా చెరువులు ఉ న్నాయి. ప్రస్తుతం ఐదు చెరువులను ఎంపిక చేసి పనులు ప్రారంభించారు.   కల్వకోల్‌, కోళ్లపడకల్‌, అమీర్‌పేట, రా మచంద్రాగూడలోని  చెరువుల్లో పనులను ఇటీవల మం త్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  గతంలో మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయగా ఇటీవల జలహితం పథకం ద్వారా పూడిక తీత పనులకు  శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌ ఉపాధి కూలీల ద్వారా పూడిక తీత పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వందలాది  కూలీలకు  పనిదొరుకుతుందని ప్రజలు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, వర్షాలు కురిస్తే చెరువులకు జలకళ సంతరించుకుంటుం దని తెలుపుతున్నారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. చెరువుల్లో తీసిన  మట్టిని పంట పొలాల్లో వేస్తే అధిక దిగుబడి వస్తుందని, ఇక ఎరువులను వేయనవసరం లేదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. చెరువులను అభివృద్ధి చేస్తున్న తె లంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉం టామని స్థా నికులు పేర్కొంటున్నారు.

భూగర్భజలాలు పెరుగుతాయి

 చెరువులను అభివృద్ధి చేస్తు న్నాం. మండలంలో ఐదు చె రువులను ఎంపిక చేశాం. ఉ పాధి కూలీల ద్వారా  పను లు చేయిస్తున్నాం. చెరువులు నిం డితే భూగర్భజలాలు పెరుగుతాయి. పూడిక తీత మట్టిని పొలంలో వేసుకొని అధిక దిగుబడి సాధించాలి. చెరువుల అభివృద్ధికి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకోవాలి.       -జగదీశ్‌,ఇరిగేషన్‌ ఏఈ 

పనులు పర్యవేక్షిస్తున్నాం

జలహితం పథకంతో చెరువుల్లో పూ డిక తీత పనులు చేపడుతున్నాం.  దీంతో ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది. ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా నిధులను కేటాయించాం. ప్రతిరోజూ ఎం త మంది కూలీలు పనిచేస్తున్నారో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నాం. చెరువుల అభివృద్ధితో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పనులు పర్యవేక్షిస్తున్నాం.    -నర్సింహులు,ఎంపీడీవో