మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 20, 2020 , 00:47:19

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్షకు   దరఖాస్తు చేసుకోవాలి

ఇబ్రహీంపట్నంరూరల్‌ : ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఓపెన్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ గోపాలకృష్ణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ నెల 31లోగా ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఓపెన్‌ డిగ్రీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని తెలిపారు.  అలాగే, ఇంటర్‌ పూర్తిచేసుకొని ఓపెన్‌ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులకు కూడా ప్రవేశాలు ఉన్నాయని తెలిపారు.  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు 7382929772 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.