మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 19, 2020 , 00:34:17

వానకాలం సాగు చేసిన ప్రతి పంట నమోదు

వానకాలం సాగు చేసిన ప్రతి పంట నమోదు

వికారాబాద్‌ రూరల్‌ : వానకాలంలో సాగుచేసిన పంటలు, అంతర్‌ పంటలను అధికారులు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌లోని అనంతగిరిపల్లిలో సాగు చేస్తున్న పంటల వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలాల్లోని పంటలు పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారితో సర్వే నంబర్‌లో విస్తీర్ణం ప్రకారం వేసిన పంట, రకాలు, నీటి వసతి, పూర్తి వివరాలు రైతులు నమోదు చేయించుకోవాలన్నారు. పత్తిలో, ఇతర పంటల్లో అంతర్‌పంటలేమైనా వేస్తే వివరాలు అధికారులకు తెలుపాలన్నారు. ఇప్పుడు నమోదు చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏఈఓ అనిల్‌, రైతులు పాల్గొన్నారు.