శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Jul 15, 2020 , 23:50:33

నిరాడంబరంగా బోనాలు

నిరాడంబరంగా బోనాలు

మొయినాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామూహికంగా బోనాల ఉత్సవాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం మండల పరిధిలోని సురంగల్‌, బాకారం, అమ్డాపూర్‌, కాశీంబౌలి, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

చేవెళ్ల రూరల్‌లో..

చేవెళ్ల రూరల్‌ : చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అంతారం, తల్లారం, దుద్దాగు, కౌకుంట్ల తదితర గ్రామాల్లో భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించి వేడుకలు జరుపుకున్నారు. అంతారం సర్పంచ్‌ సులోచనాఅంజన్‌గౌడ్‌ బోనాల పండుగ నిర్వహణను పరిశీలించి గ్రామంలో పర్యటించారు.