శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 14, 2020 , 00:55:17

కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ఆర్కేపురం: ప్రైవేట్‌ స్కూళ్లను తమలో విలీనం చేయాలం టూ ఒత్తిడి చేస్తున్న కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం అధ్యక్షు డు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్‌గౌడ్‌  సోమవారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అం దజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలను విలీనం చేసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా  ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.  స్పందించిన మంత్రి తక్షణమే విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడి అలా జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు ట్రస్మా సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మీనేందర్‌రావు, శ్రీపతి శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ, మోహన్‌రెడ్డి, బీకే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ఫీజులు వసూలు

మణికొండ: ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు బలవంతపు ఫీజులు  వసూలు చేస్తున్నాయని సీపీఎం మండల కన్వీనర్‌ రుద్రకుమార్‌ సోమవారం రాజేంద్రనగర్‌ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  ఈ ఏడాది విద్యా సంవత్సరం కొనసాగుతుందని పుస్తకాలు కొనుగోలు చేయాలని, ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. వెంటనే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట నాయకుడు శ్రీకాంత్‌ ఉన్నారు.