గురువారం 13 ఆగస్టు 2020
Rangareddy - Jul 13, 2020 , 00:05:48

174 మందికి పాజిటివ్‌

174 మందికి పాజిటివ్‌

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 120
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో 54

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : జిల్లాలో 174మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 120, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో 54, మొత్తం 174. శనివారం రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 2731 ఉండగా 1174 తాజా కేసులను కలుపుకుంటే ఈ సంఖ్య 2905కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 320మంది కోలుకున్నారు. 2273యాక్టివ్‌ కేసులు ఉండగా వీరిలో 1785 మంది తమ ఇండ్లలో, 120మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 33 మంది చనిపోయారు. జిల్లాలో 892కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. మిగిలిన యాక్టివ్‌ కేసులకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. బాలాపూర్‌ 11, కందుకూరు 1, నర్కుడ 17 , పెద్ద షాపూర్‌ 1, నార్సింగి 15, షాబాద్‌ 3, శంకర్‌పల్లి 2, ఆలూరు 1, యాచారం 1, ఇబ్రహీంపట్నం 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 17, శేరిలింగంపల్లి 28, సరూర్‌నగర్‌ 46, మైలార్‌దేవరంపల్లి 33 చొప్పున 174మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే ర్యాపిడ్‌టెస్ట్‌లతో పాటుగా ఆర్టీపీసీఆర్‌ ద్వారా 10,465మంది శాంపుల్స్‌ సేకరించారు.


logo